![]() |
| నందిగామ శివాలయం గోపురం |
కృష్ణాజిల్లా అడవిరావులపాడుకు అతి సమీపంలోనే నందిగామ గ్రామం ఉంది. నిజానికి అదిప్పుడు గ్రామంకాదు. పంచాయితీ పరిధి దాటేసి మున్సిపాలిటీకూడా అయ్యింది. చుట్టుపక్కల ఓ పాతిక గ్రామాలకు ఇది వాణిజ్యకేంద్రం. మెయిన్ రోడ్డు తెల్లవారుఝామునుంచే సందడిగా ఉంటుంది. ఆ వీధి వందలాది దుకాణాలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రమైక జీవనం, కలసికట్టుదనం అక్కడ చూడవచ్చు.
నందిగామ, దాని చుట్టుపక్కల గ్రామల పిల్లలు పాఠశాల విద్య ముగించుకుని కాలేజీల్లో చేరాలంటే ఒకప్పుడు విజయవాడదాకా వెళ్ళాల్సి వచ్చేది. ఆ సమయంలో అంటే 60వ దశకంలో నందిగామ శ్రేయోభిలాషులంతా ఒక్కటిగా నిలిచి నందిగామ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటుచేసి పెద్ద చదువుల కోసం కళాశాలకు బీజం వేశారు. వారి కృషి ఫలితంగానే 1968 జులై 12వ తేదీన ఎన్టీఆర్ కాలేజీ ఏర్పాటైంది. ఆ కాలేజీ పేరును కొన్ని అనివార్య పరిస్థితుల్లో కాకాని వెంకటరత్నం కాలేజీగా మార్చాల్సివచ్చింది. (ఆ వివరాలు ప్రస్తుతం అప్రస్తుతం). నాటి నుంచీ నేటి వరకు ఆ కళాశాల విద్యార్థులకు సరస్వతీమాత ఒడిలా మారిపోయింది. అనేక రంగాల్లో కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నవారెందరో ఇక్కడే ఈ కళాశాలలోనే చదువుకున్నవారే.
![]() |
| నందిగామ కేవీఆర్ కాలేజీ 1978 బీయెస్సీ బ్యాచ్ |
మా అన్నగారు తుర్లపాటి కోటేశ్వరరావుగారు ఇదే కాలేజీలో లెక్చరర్ స్థాయినుంచి ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగి, వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేశారు. (కాలేజీ జ్ఞాపకాల గురించి మరోసారి చెబుతాను)
నందిగామ అన్న పేరు ఎలా వచ్చిందంటే అక్కడి శివాలయంలో పెద్ద నంది ఉండటం మూలానే అని చెబుతుంటారు. శివాలయాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, షుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారట. ఈ దేవాలయము (పంచలింగక్షేత్రము)గా ప్రసిద్ధిచెందిన మహా శివక్షేత్రము.
ఈ దేవాలయానికి మా నాన్నగారు (తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాదరావు- టివిఎంవీ ప్రసాదరావుగారు) ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేశారు.
![]() |
| తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాదరావుగారు |
తుర్లపాటి వంశస్థులైన పెద్దలు చాలామంది ఈ శివాలయంలో జరిగే ధార్మిక కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పాటును అందించారు. అందిస్తూనే ఉన్నారు.
నందిగామ మునేరు తీరప్రాంతంలో ఉంది. బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఏటినిండా బోలెడు నీళ్లుంటాయి. ఎండాకాలంలో మాత్రం ఏరు ఎండిపోయి దీనంగా కనబడుతుంటుంది. మా చిన్నప్పుడు మిత్రులు విజయబాబు, గిరీశం (వీళ్లిద్దరూ బంధువులు కూడా)మరికొంత మందితో కలసి ఇంట్లో చెప్పకుండా ఏటిఒడ్డుకు వెళ్ళి ఈత కొట్టేవాళ్లం. అలాంటి సమయంలో ఓసారి నేను మునిగిపోయాను. శ్వాస ఆడటంలేదు. ఎవరో రక్షించారు. ఎవరన్నది గుర్తుకురావడంలేదు. అప్పటి నుంచి ఈ ఈతలూ, నీళ్లు మన ఒంటికి పడవని
- తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208
(తరంగా రేడియో ప్రొగ్రామ్ డైరెక్టర్, జర్నలిస్ట్)



