కిందటి ఏడాది అంటే 2014 మార్చి నాలుగవ తేదీన ఇదే బ్లాగ్ లో నేనో పోస్ట్ పెట్టాను. ఆ వ్యాసం సారాంశం ఏమంటే, నందిగామ, అడవి రావులపాడు ప్రాంతం త్వరలోనే పారిశ్రామిక వాడగా మారిపోయే అవకాశాలున్నాయన్నదే.
పారిశ్రామిక సముదాయాలు (క్లస్టర్లు) ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు కనబడుతోంది. నందిగామ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ హబ్ రాబోతున్నట్టు చెప్పారు. చాలా సంతోషం. నందిగామ- అడవిరావులపాడు ప్రాంతం పారిశ్రామిక వాడ కావడానికి ఇప్పుడు ఒక చక్కని అవకాశం వచ్చినట్టే. 2014లో నేను ఒక వ్యాసం రాస్తూ, నందిగామ - అడవి రావులపాడు మార్గం పారిశ్రామిక వాడగా మారే అవకాశాలున్నాయని http://turlapati-adaviravulapadu.blogspot.in/ లో రాశాను. నేను వ్యాసంలో రాసిన అభివృద్ధి సూచనలు మరింత స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధిని కోరుకునేవారంతా హర్షించతగ్గ శుభపరిణామం ఇది.
అప్పట్లో నేను రాసిన వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ పెడుతున్నాను.
పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు
ఈ ప్రశ్న ఇప్పటికిప్పుడు ఆశ్చర్యాన్నీ, సందేహాలను కలిగించవచ్చు. చాలా ముందస్తు ఆలోచన అని కొట్టిపారేయవచ్చు. కానీ, కాలచక్రాన్ని గిర్రున ఓ పదిపదిహేను సంవత్సరాలకు ఫార్వార్డ్ చేస్తే, నేనిప్పుడు ఈ బ్లాగ్ లో రాస్తున్న మాటలు యధార్థమయ్యాయని మీరే అంగీకరిస్తారు. ఇలా నేను రాయడానికి చిలకజోస్యమో, లేదా కోయదొర జోస్యం మీదనో ఆధారపడలేదు. నా లాజిక్స్ నాకున్నాయి. అవి నిజం అవుతాయన్న నమ్మకమూ నాకుంది.
1. అడవిరావులపాడు కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది, నందిగామ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది .
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రియల్టర్ల దృష్టి ఇప్పుడు సీమాంధ్రలోని ఇతరప్రాంతాలతోపాటు, నందిగామ మండలంలోని గ్రామాలమీద కూడా పడింది.
3. నందిగామ నుంచి అడవిరావులపాడు గ్రామానికి వెళ్ళే దారిని చీల్చుకుంటూ విజయవాడ- హైదరాబాద్ బైపాస్ రోడ్డు వెళుతుంటుంది.
4. ఈ బైపాస్ రోడ్డు దాటాకనే , అడవిరావులపాడు గ్రామంవైపునే పక్కా రోడ్డుకుఆనుకునే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది.
5. అది దాటాక మరికొంత దూరం (రావులపాడు వైపుకే) వెళితే ఎడమ చేతివైపున ఒక డొంకదారి వస్తుంది. ఆ దారివెంట లోపలికి వెళితే అక్కడ దాదాపు 30 ఎకరాల్లో ఓ ప్యాక్టరీని నిర్మించడానికి ప్రాంతీయపార్టీకి చెందిన రాజకీయ నాయకులొకరు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
6. అదే నిజమైతే, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మరిన్ని ప్యాక్టరీలు, `రియల్' ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేకపోలేదు.
7. రోడ్ కనెక్టివిటీ బాగుండటం, పక్కనే వాగు ప్రవహించడంవల్ల నీటి ఎద్దడిఉండదు.
8. మెట్టపొలాలు కావడం వల్ల తక్కువధరలోనే పారిశ్రామికవేత్తలూ, రియల్టర్లు స్థలాలను సేకరించవచ్చు. ఇప్పటికే ఈ కారణంగా పొలాల రేట్లు రెండు రెట్లు పెరిగాయని అంటున్నారు.
9. విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ ప్రాంతం (రావులపాడు సహా) అభివృద్ధిచెందే ప్రాంతంగా మారబోతుందనడానికి ఇంతకన్నా ఆధారాలు మరేం కావాలి. సీమాంధ్రలోని ప్రతిగ్రామం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే హైదరాబాద్ కోల్పోయామన్న బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
- తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి