![]() |
| నందిగామ నుంచి అడవిరావులపాడు వెళ్తూ.. |
1. అడవిరావులపాడు కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది, నందిగామ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది .
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రియల్టర్ల దృష్టి ఇప్పుడు సీమాంధ్రలోని ఇతరప్రాంతాలతోపాటు, నందిగామ మండలంలోని గ్రామాలమీద కూడా పడింది.
3. నందిగామ నుంచి అడవిరావులపాడు గ్రామానికి వెళ్ళే దారిని చీల్చుకుంటూ విజయవాడ- హైదరాబాద్ బైపాస్ రోడ్డు వెళుతుంటుంది.
4. ఈ బైపాస్ రోడ్డు దాటాకనే , అడవిరావులపాడు గ్రామంవైపునే పక్కా రోడ్డుకుఆనుకునే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది.
5. అది దాటాక మరికొంత దూరం (రావులపాడు వైపుకే) వెళితే ఎడమ చేతివైపున ఒక డొంకదారి వస్తుంది. ఆ దారివెంట లోపలికి వెళితే అక్కడ దాదాపు 30 ఎకరాల్లో ఓ ప్యాక్టరీని నిర్మించడానికి ప్రాంతీయపార్టీకి చెందిన రాజకీయ నాయకులొకరు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
6. అదే నిజమైతే, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మరిన్ని ప్యాక్టరీలు, `రియల్' ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేకపోలేదు.
![]() |
| రోడ్డు పక్కన మెట్టపొలంలో మెరప పంట |
7. రోడ్ కనెక్టివిటీ బాగుండటం, పక్కనే వాగు ప్రవహించడంవల్ల నీటి ఎద్దడిఉండదు.
8. మెట్టపొలాలు కావడం వల్ల తక్కువధరలోనే పారిశ్రామికవేత్తలూ, రియల్టర్లు స్థలాలను సేకరించవచ్చు. ఇప్పటికే ఈ కారణంగా పొలాల రేట్లు రెండు రెట్లు పెరిగాయని అంటున్నారు.
9. విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ ప్రాంతం (రావులపాడు సహా) అభివృద్ధిచెందే ప్రాంతంగా మారబోతుందనడానికి ఇంతకన్నా ఆధారాలు మరేం కావాలి. సీమాంధ్రలోని ప్రతిగ్రామం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే హైదరాబాద్ కోల్పోయామన్న బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
- తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి